ఒక చేయూత.. ఓ జీవితానికి కొత్త బాట..

పెద్ద మనసు చాటుకున్న వరగంటి శ్రీకాంత్, సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి జీవనోపాధికి పాన్ డబ్బా ఏర్పాటు.. దాతల మానవతా దృక్పథం హిందుస్థాన్ మీడియా, దూల్మిట్ట, ఆగస్టు 23: అమ్మానాన్న లేరు.. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం.. కాళ్లకు చలనం లేదు.. అయినా ఆత్మవిశ్వాసంతో మూడు చక్రాల బండిపై చిరుతిళ్లు, కురుకురేలు, మసాలాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న దివ్యాంగుడు తమ్మడి రాజుకు పలువురు దాతలు అండగా నిలిచారు. ఆయన దీనస్థితిపై వెలువడిన వార్తా కథనానికి స్పందించిన చేర్యాలకు చెందిన వరగంటి శ్రీకాంత్ తన సొంత ఖర్చులతో పాన్ డబ్బాను తయారు చేయించి బుధవారం దూల్మిట్ట గ్రామంలో ప్రారంభించారు. దీంతో రాజుకు స్థిరమైన జీవనోపాధికి ఒక మార్గం ఏర్పడింది.అదేవిధంగా లింగాపూర్...