కోతుల బెడద తో ప్రజల బెంబేలు
ఇళ్లలోకి చొరబడి ఆహారం ఎత్తుకెళ్తున్న కోతులు చిన్నారులు, మహిళలు, వృద్ధుల్లో భయాందోళన హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 23: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడంతో పాటు ఇంటి పైకప్పులు, పంటలు, పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. కోతుల గుంపులు అకస్మాత్తుగా దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడదపై పలుమార్లు...