మర్పడగ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

సర్పంచ్ ఆకారం బాలరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం హిందుస్థాన్ మీడియా, కొండపాక, ఆగస్టు 22: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆకారం బాలరాజ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.