జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులతో బిఆర్ఎస్వీ ధర్నా

పాలిటెక్నిక్ వ్యవస్థను స్వతంత్రంగా కొనసాగించాలి: బీఆర్‌ఎస్‌వీ హిందుస్థాన్ మీడియా, చేర్యాల: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ/శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేర్యాల బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో పెద్ద ఎత్తున ధర్నా, ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేర్యాల బీఆర్‌ఎస్‌వీ పట్టణ అధ్యక్షుడు ఒగ్గు శ్రీశైలం మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు అందుతున్న...