ప్రభుత్వ కార్యాలయాలకు ఐదు గడియారాల వితరణ

రిచ్ చిల్డ్రన్, మంజునాథ్ హాస్పిటళ్ల సేవాభావం హిందుస్థాన్ మీడియా, దూల్మిట్ట, ఆగస్టు 20: దూల్మిట్ట గ్రామ సర్పంచ్ గురుకుల లీలా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రిచ్ చిల్డ్రన్ హాస్పిటల్, మంజునాథ్ హాస్పిటల్ యాజమాన్యాలు గ్రామంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు ఐదు గడియారాలను ఉచితంగా అందజేశారు. గ్రామ ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ గడియారాలను అందించినట్లు హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, గ్రామపంచాయతీ కార్యాలయం, రైతు వేదిక, జెడ్పీహెచ్‌ఎస్ దూల్మిట్ట పాఠశాలకు ఒక్కొక్క గడియారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు....