సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే ఆలోచన మానుకోవాలి: విద్యార్థి సంఘాలు డిమాండ్

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి జీవో నం.97ను రద్దు చేసి.. శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి నేషనల్ హైవేపై ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ భారీ ధర్నా హిందుస్థాన్ మీడియా, చేర్యాల: సాంకేతిక విద్యాశాఖను నిర్వీర్యం చేసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేర్యాలలో భారీ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం చేర్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి–365బీపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల నరేష్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి తాడూరి...