జిల్లా డీడబ్ల్యూఓ ఏకపక్ష వైఖరిని మార్చుకోవాలి:ఎన్‌పీఆర్‌డీ
జిల్లా స్థాయి కమిటీలో ఎన్‌పీఆర్‌డీకి ప్రాతినిధ్యం కల్పించాలి అధిక మద్దతు అవసరమైన వికలాంగులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలి ఎన్‌పీఆర్‌డీ సిద్దిపేట జిల్లా కమిటీ డిమాండ్ హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట, ఆగస్టు 19: వికలాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయాల్సిన జిల్లా స్థాయి కమిటీలో తమ సంఘానికి ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌పీఆర్‌డీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ వికలాంగుల జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమ సంఘం అనేకసార్లు జిల్లా అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, తమను పక్కనపెట్టి డీడబ్ల్యూఓకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే సమాచారం...