జాలపల్లి లో బోనాల జాతరకు ముమ్మర ఏర్పాట్లు : సర్పంచ్ కమలాకర్

అమ్మవారి ఆలయాల వద్ద ముందస్తు ఏర్పాట్లు హిందుస్థాన్ మీడియా, దూల్మిట్ట, ఆగస్టు 19: దూల్మిట్ట మండలం జాలపల్లి గ్రామంలో ఈ నెల 23న పోచమ్మ, ఎల్లమ్మ బోనాల జాతర నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని గ్రామ సర్పంచ్ చెట్కూరి కమలాకర్ యాదవ్ తెలిపారు. బోనాల జాతరను పురస్కరించుకుని గ్రామంలో విద్యుత్ దీపాల ఏర్పాటు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, ఆలయ ప్రాంగణం పరిశుభ్రత తదితర పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు పరిసరాలను శుభ్రం చేస్తున్నామని పేర్కొన్నారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం,...