మద్దూర్ లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
ఫొటోగ్రాఫర్లకు ఐడీ కార్డుల పంపిణీ హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 19: మద్దూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ అండ్ వీడియో గ్రాఫర్స్ తెలంగాణ అసోసియేషన్ జెండాను మద్దూరు మండల ఫొటోగ్రాఫర్ల ఉపాధ్యక్షుడు దాసు మహేందర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ రహీం, ఫొటోగ్రఫీ సృష్టికర్త జోసెఫ్ లూయిస్ డాగ్యూర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఫొటోగ్రాఫర్లకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఫొటోగ్రఫీ రంగంలో సేవలందిస్తున్న ఫొటోగ్రాఫర్ల కృషిని పలువురు అభినందించారు. ఒక క్షణాన్ని చిత్రంగా బంధించి, ఆ దృశ్యాన్ని భవిష్యత్ తరాలకు సాక్ష్యంగా నిలిపే ఫొటోగ్రాఫర్ల...