హమ్మయ్య..! ఈ రోడ్డు కూడా ఎన్‌హెచ్‌–365బీదే..!

బచ్చన్నపేట ప్రజల పోరాటాలు.. పత్రిక కథనాల ఎఫెక్ట్ ఎట్టకేలకు ప్రారంభమైన రోడ్డు పనులు.. 2 కి.మీ. నరకయాతనకు తెర! ​బచ్చన్నపేట (హిందుస్థాన్ మీడియా): “హమ్మయ్య..! ఈ రోడ్డు కూడా ఎన్‌హెచ్‌–365బీదే అన్నమాట..!” అంటూ బచ్చన్నపేట ప్రజలు, నిత్య ప్రయాణికులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా నరకప్రాయంగా మారిన బచ్చన్నపేట పరిధిలోని కీలక రహదారి పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. స్థానిక ప్రజల నిరసనలు, ప్రజా సంఘాల పోరాటాలు, పత్రికల్లో వచ్చిన వరుస కథనాల ప్రభావంతో కాంట్రాక్టర్ స్పందించి రోడ్డు పనులను ప్రారంభించారు. ​50 కి.మీ. ప్రయాణం ఒకెత్తు.. ఈ 2 కి.మీ. మరో ఎత్తు!సిద్దిపేట నుంచి జనగామ వరకు సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణం...