ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి

అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు పాపన్న: నాయకులు హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 18: సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని మద్దూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేజీకేఎస్ మండల అధ్యక్షుడు పోతుగంటి లింగం గౌడ్, మర్మముల సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. పాపన్న గౌడ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు...