దూల్మిట్ట మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బండి శ్రీనివాస్
“పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా” హిందుస్థాన్ మీడియా, దూల్మిట్ట, ఆగస్టు 18: బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన బండి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ దూల్మిట్ట మండల అధ్యక్షుడిగా నియమితులయ్యారు.ఈ సందర్భంగా బండి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మండలంలో మంచి పేరు తీసుకొస్తానన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్...