వరి నుంచి ఆయిల్ పామ్ వైపు రైతుల అడుగులు...

దాచారంలో 19 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు పంటను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: సంప్రదాయ వరి సాగుకు బదులుగా దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్‌పామ్ సాగువైపు రైతులు అడుగులు వేస్తున్నారు. ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు 19 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు.దాచారం గ్రామానికి చెందిన సురభి రవీందర్ రావు 10 ఎకరాల్లో, సురభి సంతోష్ రావు 9 ఎకరాల్లో గతంలో వరి సాగు చేసేవారు. ఆయిల్‌పామ్ సాగుతో కలిగే ప్రయోజనాలను తెలుసుకున్న వారు వరి సాగుకు స్వస్తి పలికి ఆయిల్‌పామ్ సాగును చేపట్టారు. 386 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జిల్లా కలెక్టర్ గరిమ...