ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: DYFI దాసరి ప్రశాంత్ డిమాండ్
ఆగస్టు 20న కలెక్టరేట్ ఎదుట ధర్నా: డీవైఎఫ్‌ఐ నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమానికి పిలుపు హిందుస్థాన్ మీడియా, చేర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు డీవైఎఫ్‌ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ తగిన ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారని ప్రశాంత్ ఆవేదన...