భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డుల పంపిణీ
ప్రతి కార్మికుడు లేబర్ కార్డు పొందాలి: రాష్ట్ర అధ్యక్షుడు ముస్త్యాల గణేష్ హిందుస్థాన్ మీడియా, చేర్యాల: తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలోని ఎల్లమ్మ దేవాలయ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముస్త్యాల గణేష్ ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ముస్త్యాల గణేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు తప్పనిసరిగా లేబర్ గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. కార్మికులకు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, హక్కులను పొందేందుకు లేబర్ కార్డు ఉపయోగపడుతుందని...