యువత ఉచిత డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: యోగేశ్వర్ జాదవ్
కేవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ స్కూల్ ప్రారంభం 18 ఏళ్లు నిండిన యువతకు శిక్షణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట, ఆగస్టు 17: 18 సంవత్సరాలు నిండిన యువత ఉచిత డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి యోగేశ్వర్ జాదవ్ సూచించారు. సిద్దిపేట పట్టణంలో కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంశీధర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగేశ్వర్ జాదవ్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేలా ఉచిత డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యువత శిక్షణను సద్వినియోగం...