పిండిలో పురుగులు... కుళ్ళిన కూరగాయలు, పండ్లు.. ఇది మద్దూరు కేజీబీవీ పరిస్థితి: ఎస్ఎఫ్ఐ,సిపిఎం ఆరోపణ

కేజీబీవీ ఫుడ్ పాయిజన్‌కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అధికారుల నిర్లక్ష్యమే విద్యార్థినుల అస్వస్థతకు కారణం: ఎస్ఎఫ్‌ఐ, సీపీఎం రెండు రోజుల్లో తాత్కాలిక పరిష్కారం.. రెండు నెలల్లో శాశ్వత పరిష్కారం: అధికారులు హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 17: మద్దూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్‌ఐ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కేజీబీవీని సందర్శించిన అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సి ఉండగా, పాఠశాలలోని గోధుమ, శనగపిండి, రవ్వలో పురుగులు, పల్లీల్లో...