నేనున్నాను.. అమ్మ..ధైర్యంగా ఉండండి. విద్యార్థినిలకు కలెక్టర్ హైమావతి భరోసా..!
మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థినులకు అస్వస్థత ఆసుపత్రి, కేజీబీవీలో కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీ హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 17: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మధ్యాహ్న భోజనం అనంతరం 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న విద్యార్థినులను ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో పాఠశాల సిబ్బంది 108 వాహనం ద్వారా చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో విద్యార్థినులను పరామర్శించిన కలెక్టర్ ఘటనపై సమాచారం అందుకున్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సోమవారం సాయంత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేజీబీవీని,...