ప్రజావాణి చేర్యాలలోనే నిర్వహించాలి: యువజన కాంగ్రెస్ డిమాండ్!
ముస్త్యాల రైతు వేదిక నుంచి మండల కేంద్రానికి వేదికను మార్చాలని విజ్ఞప్తి అన్ని గ్రామాల ప్రజలకు చేర్యాల కేంద్రమైతేనే ప్రయాణ సౌలభ్యం అన్ని శాఖల అధికారులు విధిగా హాజరై సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రం అందజేత చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ప్రజా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వేగంగా పరిష్కరించేందుకు చేపట్టిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ముస్త్యాల రైతు వేదిక నుంచి చేర్యాల మండల కేంద్రానికి మార్చాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని సుదూర గ్రామాల ప్రజలందరికీ చేర్యాల పట్టణ కేంద్రం రవాణా పరంగా ఎంతో అందుబాటులో ఉంటుందని, ప్రజల సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వేదికను తక్షణమే మార్చాలని వారు...