బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే ; జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
21 ఫిర్యాదులు స్వీకరణ రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 21 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై చట్టపరంగా విచారణ చేపట్టి బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, ప్రజా...