దుబ్బాక సీరియల్ హత్యల గుట్టు రట్టు,మిస్టరీని ఛేదించిన సిద్దిపేట పోలీసులు
బంగారం కోసం తల్లి–కొడుకు కలిసి హత్యలు.. నిందితురాలు అరెస్ట్, బాలుడు జువైనల్ హోమ్‌కు కేసును ఛేదించిన సిద్దిపేట పోలీసులను అభినందించిన సీపీ రష్మీ పెరుమాళ్ హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట: దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారులో ఇటీవల కలకలం రేపిన పాక్షికంగా కాలిపోయిన మహిళ మృతదేహం కేసు మిస్టరీని సిద్దిపేట పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో మృతురాలు భూంపల్లి గ్రామానికి చెందిన *అతికం విజయ (45)*గా గుర్తించారు. డబ్బు, బంగారం కోసం ఆమెను అదే గ్రామానికి చెందిన చాకలి రజిత (38), ఒక బాలుడు కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితురాలు రజితను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించగా,...