ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్న మద్దూరు ఎంపీడీవో రామ్మోహన్!

మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రశంసా పురస్కారం స్వీకరణ ​మండల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలులో విశేష ప్రతిభకు గుర్తింపు ​మరింత బాధ్యతతో ప్రజాసేవ అందిస్తా: ఎంపీడీవో రామ్మోహన్ ​మద్దూరు (హిందుస్థాన్ మీడియా): ​80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో మద్దూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రామ్మోహన్ ఉత్తమ సేవా ప్రశంసా పురస్కారాన్ని అందుకున్నారు. విధుల్లో చూపిన అత్యుత్తమ ప్రతిభ, అంకితభావానికి గుర్తింపుగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. ​అవార్డు బాధ్యతను మరింత పెంచింది: ఎంపీడీవో రామ్మోహన్...