​చేర్యాల సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ డా. దేవేందర్‌కు ప్రశంసా పురస్కారం!

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ​చేర్యాల సీహెచ్‌సీ మెడికల్ సూపరింటెండెంట్‌కు దక్కిన విశిష్ట గౌరవం ​కలెక్టర్ హైమావతి, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం ​వైద్య రంగంలో విశేష సేవలకు గుర్తింపు.. వెల్లువెత్తిన అభినందనలు ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చేర్యాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) మెడికల్ సూపరింటెండెంట్ డా. దేవేందర్ విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్నారు. జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి చేతుల మీదుగా ఆయన ఈ ప్రశంసాపత్రాన్ని స్వీకరించారు....