పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

సిరిసిల్లలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం హిందుస్థాన్ మీడియా, రాజన్న సిరిసిల్ల జిల్లా: పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు ఫంక్షన్ హాల్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రతి మండలానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. జిల్లాలో 1,95,915 స్మార్ట్ రేషన్ కార్డులు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్...