నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి:రాజ్‌కుమార్

చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు పోరాటం: ఏఐవైఎఫ్ హిందుస్థాన్ మీడియా, చేర్యాల: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్‌కుమార్ అన్నారు. శనివారం చేర్యాల పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల ఏఐవైఎఫ్ మహాసభలు గూడెపు సుదర్శన్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా జనగాం రాజ్‌కుమార్ మాట్లాడుతూ చేర్యాల ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అందరూ ఏకమై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఖాళీ ఉద్యోగాలను వెంటనే...