తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం

ఇల్లంతకుంటలో స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఉద్యమ యోధులకు గౌరవం హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ ఎం. రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారికి సమాజం తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొన్నారు. ఉద్యమకారుల సేవలను గుర్తించి వారికి...