జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ రమేష్ రాథోడ్

బంజరపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హిందుస్థాన్ మీడియా, నెక్కొండ: నెక్కొండ మండలం బంజరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భూక్య రమేష్ రాథోడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు కృషి చేసిన మహనీయుల సేవలను కొనియాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. వారి ఆశయాలు, అడుగుజాడల్లో నడుస్తూ స్వాతంత్ర్య ఫలాలు భావితరాలకు మరింత మేలు చేకూరేలా గ్రామ ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏరా...