చిన్నకోడూరు లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

త్రివర్ణ పతాకాలతో మార్మోగిన గ్రామాలు.. దేశభక్తి స్ఫూర్తితో వేడుకలు హిందుస్థాన్ మీడియా న్యూస్, ప్రతినిధి, సిద్దిపేట జిల్లా, చిన్నకోడూర్, ఆగస్టు 15: చిన్నకోడూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రజా సంఘాల కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సలీం, ప్రజాపరిషత్ వద్ద జనార్ధన్, పోలీస్ కార్యాలయంలో చంద్రమోహన్, ప్రభుత్వ పాఠశాలల్లో నాగరాజు రెడ్డి, రాజశ్రీ, అంగన్వాడీ...