చేయూత పెన్షన్లలో అర్హులెవరూ మిస్ కావొద్దు :పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్
ఈ నెల 31లోపు దరఖాస్తులు స్వీకరించాలి హిందుస్థాన్ మీడియా, నెక్కొండ: నెక్కొండ మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, ఐఏఎస్ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత పెన్షన్ల ఎంపికలో తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలపై సూచనలు చేశారు. చేయూత పెన్షన్లకు సంబంధించి ఒంటరి మహిళలు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు బాధితులు తదితర అర్హుల నుంచి దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోపు గ్రామపంచాయతీ కార్యాలయంలో సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. అర్హత కలిగిన ఒక్క పెన్షన్‌దారు కూడా మిస్ కాకుండా కచ్చితంగా గుర్తించి ఎంపిక చేయాలని,...