రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి సాదాబైనామా కేసుకు ఆమోదం!

​తంగళ్లపల్లి రెవెన్యూ పరిధిలోని రైతు ఇటికాల శంకర్‌కు 13(B) ఉత్తర్వులు అందజేత ​కలెక్టరేట్‌లో లబ్ధిదారునికి పత్రాలు అందజేసిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ ​అర్హత కలిగిన అన్ని సాదాబైనామా కేసులను వేగంగా పరిష్కరిస్తాం: ఆర్డీవో శ్రీధర్ బాబు ​రాజన్న సిరిసిల్ల (హిందుస్థాన్ మీడియా): ​జిల్లాలోనే తొలి సాదాబైనామా క్రమబద్ధీకరణ ​సాదాబైనామా ద్వారా జరిగిన వ్యవసాయ భూ లావాదేవీల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే తొలి సాదాబైనామా కేసు ఆమోదం పొందింది. తంగళ్లపల్లి మండలంలోని తంగళ్లపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో నమోదైన ఈ దరఖాస్తుకు తుది ఆమోదం లభించడం భూ హక్కుల పరిష్కారంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) శ్రీధర్...