అక్రమ ఇసుక రవాణా..కేసు నమోదు

అనుమతులు లేకుండా రాత్రివేళ ఇసుక తరలింపు.. ట్రాక్టర్ పట్టివేత హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామ శివారులోని బిక్కవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అందిన సమాచారం మేరకు ఇల్లంతకుంట పోలీసులు రాత్రి సమయంలో దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తూరు గ్రామానికి చెందిన కుంభం శ్రీనివాస్ ఎలాంటి అనుమతులు లేకుండా టీజీ 23 టీ 0047 నంబర్ గల ట్రాక్టర్‌లో ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసినందుకు శ్రీనివాస్‌పై ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ జి. లక్పతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా ఇసుక తరలింపునకు...