స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన ప్రభుత్వ కార్యాలయాలు
త్రివర్ణ పతాకాలతో కళకళలాడుతున్న పాఠశాలలు, కళాశాలలు, గ్రామపంచాయతీలు హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 14: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మద్దూరు మండలంలోని గ్రామాలు ముస్తాబయ్యాయి. శనివారం నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో సందడి నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ భవనాలను త్రివర్ణ పతాకాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలాపనతో పాటు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశభక్తి కార్యక్రమాలకు ఏర్పాట్లు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువత, విద్యార్థుల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో...