రైతులకు ప్యాక్స్‌లు వెన్నుదన్నుగా నిలవాలి: ఎమ్మెల్యే కవ్వంపల్లి
రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించాలి హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) రైతులకు అండగా నిలిచి, వారి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఇల్లంతకుంట ప్యాక్స్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే.. నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.చైర్మన్‌గా ఊట్కూరి వెంకట రమణారెడ్డి, వైస్ చైర్మన్‌గా యాస తిరుపతి ప్రమాణ స్వీకారం చేశారు. డైరెక్టర్లుగా సొల్లు కవిత, ఉప్పుల సంజీవరెడ్డి, సింగిరెడ్డి లక్ష్మి, కేతిరెడ్డి నవీన్‌కుమార్‌రెడ్డి, కోనేటి నర్సయ్య, ముక్కిస ఎల్లారెడ్డి, గుండ వెంకటేశం, ఎలుక అనిల్‌కుమార్, ఏలేటి మాధవరెడ్డి,...