మద్దూరు తహసీల్దార్ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండాలి:సీపీఎం డిమాండ్
కొత్త భవనాన్ని దూరంగా నిర్మించొద్దు.. హిందుస్థాన్ మీడియా, మద్దూరు: మద్దూరు తహసీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలోనే నిర్మించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఎం నాయకులు సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆలేటి యాదగిరి మాట్లాడుతూ, గతంలో తహసీల్దార్ కార్యాలయాన్ని గ్రామానికి దూరంగా నిర్మించడంతో ప్రజలు, కార్యాలయ ఉద్యోగులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. అయితే ఇప్పుడున్న కార్యాలయం కంటే మరింత దూరంలో నూతన భవనం నిర్మించేందుకు అధికారులు...