పాము కాటుతో మహిళ మృతి, ఆకునూర్ లో విషాదం

హిందుస్థాన్ మీడియా, చేర్యాల: పాము కాటుకు గురై ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన బత్తుల పద్మ (55) ఈ నెల 8న తన వ్యవసాయ భూమిలో పనులు చేస్తుండగా పాము కాటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. పద్మకు భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.