నర్సాయపల్లి జిపి లో సమీక్ష సమావేశం

అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటిపై సమీక్ష హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 13: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి అంశాలపై సాధారణ సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ సమస్యలు, అభివృద్ధి పనులపై పాలకవర్గ సభ్యులతో చర్చించారు. సమావేశంలో తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సమస్యలతో పాటు వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్ పాయింట్లు, వర్షపు నీటి సంరక్షణ గుంతల ఏర్పాటుపై సమీక్షించారు.అలాగే ఇందిరమ్మ ఇళ్లకు ఇంకుడు గుంతలు, పిట్టలగూడెం, బస్టాండ్ సమీపంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం...