అయినాపూర్‌లో సీపీఎం ధర్నా

గ్రామ సమస్యలు పరిష్కరించాలి.. పంచాయతీ అధికారికి వినతి హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో గురువారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పంచాయతీ అధికారి రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు తేలు ఇస్తారీ మాట్లాడుతూ గ్రామంలో పలు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని కోరారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. వాటర్ ప్లాంట్ ప్రారంభించాలి: గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న వాటర్ ప్లాంట్‌ను వెంటనే ప్రారంభించి ప్రజలకు తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలి. వీధి దీపాలు...