కళ్లేపల్లి ప్రాథమిక పాఠశాలకు ప్రింటర్ విరాళంగా ఇచ్చిన దత్తాత్రేయ
పూర్వ విద్యార్థి దాతృత్వం.. ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయ బృందం హిందుస్థాన్ మీడియా, బెజ్జంకి: విద్యనభ్యసించిన పాఠశాలకు తనవంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో బెజ్జంకి మండలం కళ్లేపల్లి ప్రాథమిక పాఠశాలకు కలర్ ప్రింటర్‌ను విరాళంగా అందించారు అదే పాఠశాల పూర్వ విద్యార్థి, ఆదర్శ యూత్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు బుర్ర దత్తాత్రేయ గౌడ్. ఆదర్శ యూత్ క్లబ్ తరఫున పాఠశాలకు ప్రింటర్‌ను అందజేసిన దత్తాత్రేయ గౌడ్ మాట్లాడుతూ, తనకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం దత్తాత్రేయ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి...