పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు : సర్పంచ్ భూక్య రమేష్ రాథోడ్
బంజరపల్లిలో మొక్కల పంపిణీకి శ్రీకారం హిందుస్థాన్ మీడియా, నెక్కొండ: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బంజరపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పండ్ల, పూల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ భూక్య రమేష్ రాథోడ్ ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేసి, ప్రతి ఇంట్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ రాథోడ్ మాట్లాడుతూ “పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. చెట్లే జీవనాధారానికి తొలి మెట్లు” అని అన్నారు. మానవ మనుగడకు చెట్లు ఎంతో కీలకమని, ప్రతి కుటుంబం మొక్కలను నాటి వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు మొక్కల...