చేర్యాలలో విద్యార్థులతో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బల్ల శ్రీనివాస్ హిందుస్థాన్ మీడియా, చేర్యాల: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా చేర్యాలలో బీజేపీ మండల అధ్యక్షుడు వడ్లకొండ సంజీవులు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన బల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకాన్ని గర్వంగా చేతబట్టి ముందుకు సాగుతున్న ప్రతిక్షణం స్వాతంత్ర్య సమరయోధులు, వీర జవాన్ల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు.స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తి, సైనికుల...