​అడుగడుగునా గుంతలు.. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అవస్థలు!

​రహీంఖాన్‌పేట్ – వెల్జిపూర్ గ్రామాల మధ్య అధ్వానంగా మారిన ప్రధాన రహదారి ​రాకపోకలు సాగించలేక నిత్యం నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు, ప్రజలు ​వర్షపు నీటితో మృత్యుకూపాలుగా గుంతలు.. శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ ​ఇల్లంతకుంట (హిందుస్థాన్ మీడియా): ​రూపురేఖలు కోల్పోయిన ప్రధాన రహదారి ​సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోని రహీంఖాన్‌పేట్ – వెల్జిపూర్ గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారి తీవ్ర అధ్వానంగా తయారైంది. రహదారి పొడవునా అడుగడుగునా భారీ గుంతలు వెలిసి రోడ్డు రూపురేఖలే మారిపోవడంతో ప్రజలు ప్రయాణించడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు అత్యంత కీలకమైన ఈ మార్గం గుంతలమయంగా మారడంతో నిత్యం రాకపోకలు సాగించే వందలాది మంది...