సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండాలి

కనువిప్పు కళా ప్రదర్శనలో ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు హిందుస్థాన్ మీడియా, చేర్యాల: సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల వినియోగం, మూఢనమ్మకాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేర్యాల సీఐ బానోత్ రమేష్ నాయక్ సూచించారు.జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ ఆదేశాల మేరకు జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ, పోలీస్ కనువిప్పు బృందం, తెలంగాణ సాంస్కృతిక సారధి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి చేర్యాల మండలం కాశేగుడిసెలు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళా ప్రదర్శనలు, పాటలు, నాటికల ద్వారా ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసానికి గురైతే 1903 కి ఫోన్ చేయండి : చేర్యాల...