భువనగిరి రోడ్ల అభివృద్ధికై..గడ్కరీకి ఎంపీ చామల వినతి

ఎన్‌హెచ్‌ల విస్తరణతో పాటు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు నిర్మించాలని విజ్ఞప్తి హిందుస్థాన్ మీడియా, న్యూఢిల్లీ: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పనులను త్వరితగతిన చేపట్టాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.బుధవారం న్యూఢిల్లీలో గడ్కరీని కలిసి ఎంపీ పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. నియోజకవర్గంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్‌హెచ్‌-163ను ఆరు లైన్లుగా విస్తరించాలి ఎన్‌హెచ్‌-163ను ఆరు లైన్లుగా విస్తరించడంతో పాటు అనంతారం, రామకృష్ణాపురం వద్ద అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు...