అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర....చేర్యాలలో భారీ బైక్ ర్యాలీ
ఆగస్టు 2 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర. హిందుస్థాన్ మీడియా, చేర్యాల: కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2 నుంచి 18 వరకు ‘అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్ర’ నిర్వహిస్తున్నట్లు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. చైతన్య బస్సు యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోటలో ప్రారంభమైన యాత్ర, చేర్యాల పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా వందలాది మంది కల్లుగీత కార్మికులతో కలిసి జాతీయ రహదారిపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు....