తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి :మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్

రైతుల ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా నీటి పంపింగ్ ప్రారంభించాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు హిందుస్థాన్ మీడియా, చిన్నకోడూరు, ఆగస్టు 10: వానాకాలం సాగు కోసం రైతులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను వెంటనే ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని రైతుల సాగు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకుని వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించాలని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు తక్కువ వర్షపాతం, మరోవైపు రిజర్వాయర్లలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని...