పెద్ద లింగపూర్ - అనంతగిరి పోచమ్మ ఆలయ రోడ్డుకు నిధులు కేటాయించాలి : బీజేపీ
రోడ్డు నిర్మాణ హామీ ఏమైంది..? వర్షాలతో అధ్వానంగా మారిన రహదారిపై బీజేపీ నిరసన హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట, ఆగస్టు 10: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగపూర్ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెద్దలింగపూర్ నుంచి అనంతగిరి పోచమ్మ ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రోడ్డు నిర్మాణం చేస్తామని హామీలు ఇచ్చి, ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు...