హోరెత్తిన జైల్ భరో నినాదాలు, సిఐటియు నాయకుల అరెస్ట్

మద్దూరులో రాస్తారోకో.. పోలీసులు అడ్డుకుని ఆందోళన విరమింపజేత హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 10: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు.దూల్మిట్ట మండల కేంద్రంలో నిరసన తెలిపిన అనంతరం మద్దూరు మండల కేంద్రంలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా జైల్‌భరో నినాదాలతో ప్రాంతం మారుమోగింది. సమాచారం అందుకున్న మద్దూరు ఎస్‌ఐ ఆసిఫ్ పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాస్తారోకో చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆందోళనను విరమింపజేశారు.కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల...