దేశ సంపదను కొల్లగొడుతున్న విధానాలను రద్దు చేయాలి

క్విట్‌ కార్పొరేట్‌ నినాదంతో చేర్యాలలో రాస్తారోకో.. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్ మావో హిందుస్థాన్ మీడియా, చేర్యాల, ఆగస్టు 10: దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రైవేటీకరణ విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్ మావో డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ‘క్విట్ కార్పొరేట్’ నినాదంతో సోమవారం చేర్యాల పాత బస్టాండ్ కూడలిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కొంగరి వెంకట్ మావో మాట్లాడుతూ, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేద, మధ్యతరగతి ప్రజలపై...