మాటలు కాదు.. చేతల్లో చూపిస్తున్న జాలపల్లి సర్పంచ్: సీపీఐ నేత నర్సింహా చారి

ఎన్నికైన ఏడాది లోపే అభివృద్ధి పనులకు శ్రీకారం.. పారిశుధ్యం, రోడ్లు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి హిందుస్థాన్ మీడియా, జాలపల్లి: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో చూపిస్తున్న జాలపల్లి గ్రామ సర్పంచ్ చెట్కూరి కమలాకర్ పై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికైన కమలాకర్, పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తికాకముందే గ్రామంలోని పలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారని సీపీఐ రాష్ట్ర భూపోరాట కన్వీనర్ వలబోజు నర్సింహాచారి తెలిపారు.గ్రామంలో ఎక్కడ సమస్య కనిపించినా వెంటనే స్పందిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఇళ్ల సమీపంలో, రోడ్ల...