రైతుల జీవితాల్లో మార్పు రావాలన్న కల సాకారం : మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేటను దక్షిణ భారతదేశంలోనే ఆయిల్‌పామ్ సాగులో అగ్రస్థానంలో నిలుపుతాం హిందుస్థాన్ మీడియా, చిన్నకోడూరు, ఆగస్టు 9: రాబోయే రోజుల్లో సిద్దిపేట జిల్లా ఆయిల్‌పామ్ సాగులో దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామంలో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు నారాయణరావుపేట మండలం గోపులాపూర్‌లో ఆయిల్‌పామ్ మొక్కను నాటారు. అనంతరం మేడిపల్లిలో రైతు పాపిరెడ్డి సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటలో గెలల కోతను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, రైతుల జీవితాల్లో ఆర్థిక మార్పు తీసుకురావాలన్న తన ఐదేళ్ల కల ఆయిల్‌పామ్ సాగుతో సాకారమవుతోందని అన్నారు. ఐదేళ్ల క్రితం...